08554239641
Old Town - Ananthapuram (A.P.) - 515001

About Sangham

History and legacy of Sri Kanyaka Parameswari Devasthanam and Arya Vysya Sangham.

Important Updates

About Arya Vysya Sangham - Old Town - Ananthapuramu/ Anantapur

Dhanya AryaVysya/Donors, we honour every one who serves our Arya Vysya Sangham and Sri Vasavi Kanyakaparameswari Temple. We never disregard. By observing our respects to the contributors numerous approached and showing their generosity. Arya  Vysyas belongs to many parts of India and abroad showing their bolster liberality in supporting our Sangham after observing our development programmes and honouring systems. Most of the community people heartfully expressed their gratitude to the committee members for our appreciations to the donors. You are pleased to visit all links in our website, how we are treating contributors who showed interests on our temple/sangham. Dhanyavaad - Arya Vysya Sangham - Old Town - Ananthapuramu.

Our Founders

Bhupalam Pedda Adinarayana Shresty

Bhupalam Pedda Adinarayana Shresty

Bhupalam Chinna Adinarayana Shresty

Bhupalam Chinna Adinarayana Shresty

We always remember their gracious and liberal donation. Late Sri. Bhupalam Pedda Adinarayana Setty and Late Sri. Bhupalam Chinna Adinarayana Setty - Anantapur, Andhra Pradesh who donated the present Arya Vysya chowltry entire plot. The present market value of the land is approximately 10 crore INR.

Sri Vasavi Kanyakaparameswari Temple - Old Town - Anantapur - Andhra Pradesh - India.

ఆర్యవైశ్య సంఘము

**శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానము**
పాతవూరు, అనంతపురము - 515 001. ఆంధ్రప్రదేశ్‌, ఇండియా.
ఫోన్‌: 08554 - 239641. వెబ్‌సైట్‌: [www.aryavysyasangham.org](http://www.aryavysyasangham.org)

శ్రీ నగరేశ్వరస్వామి మరియు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానముల చరిత్ర:

రాయలసీమలోని అనంతపురము జిల్లా, పాతవూరు, గాంధీబజార్ నందు గల శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానము అతిపురాతనమైనది. ఈ దేవస్థానము దాదాపు 500 సం॥లకు పూర్వం విజయనగర రాజులకాలంలో జైత్రయాత్ర సందర్భమున నిర్మించబడినదని వాడుకలో చెప్పబడుచున్నది. దీని పూర్తి కట్టడం ఏకశిలరాళ్లతో నిర్మించడమైనది. దాదాపు ఇప్పుడున్న రోడ్డుకి 10 అడుగుల లోపల దేవస్థానము ఉంది. ఇది అతిపురాతనమైనది. దీని అడుగు భాగము కోనేరు కూడా ఉండేదని పూర్వీకుల ఉవాచ. కాలగర్భమున అది జీర్ణించిపోయినది.

లోపల ఆలయములో ప్రసిద్ధ వినాయకుడు, వీరభద్రస్వామి, కుమారస్వామి, కార్తికేయుడు, కాశీవిశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్షి, ప్రధానంగా నగరేశ్వరుడు, పార్వతీదేవి, భూదేవి శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వరస్వామి, శ్రీ ఆంజనేయస్వామి మరియు కాలభైరవుడి మూర్తులు కృష్ణశిలతో చేయబడినవి కలవు. ఈ విగ్రహములన్నిటికి ఇప్పటికీ నిత్య పూజలు జరుగుచున్నవి.

ఈ దేవాలయమునకు కుడి భాగమున వున్న దాదాపు అర్ధఎకరా స్థలమును అనంతపురము పట్టణ వాస్తవ్యులు భూపాళ వంశీయులైన కీ॥శే॥ భూపాళం పెద్ద ఆదినారాయణశెట్టి గారు మరియు చిన్న ఆదినారాయణ శెట్టి గార్లు ఈ స్థలమును దేవాలయ అభివృద్ధికి గాను కళ్యాణమండపము నిర్మించుటకు విరాళముగా ఇచ్చినారు.

దేవాలయము జీర్ణావస్థస్థితికి చేరుకోకముందే పట్టణ ఆర్యవైశ్య సోదరసోదరీమణుల సహాయసహకారములతో ప్రముఖులైన కీర్తిశేషులైన డి.సి. నరసింహయ్యశెట్టి గారు, మేదా రామయ్యశెట్టి గారు, గొంది నాగయ్య శ్రేష్టి గారు, మేదా సుబ్బయ్య శ్రేష్టి గారు, గొంది కొండప్ప గారు, చిత్రాల కిరీటప్ప గారు, కల్లూరు రాజగోపాలయ్య గారు, తలుపుల వెంకటయ్య గారు మరియు ముత్యాల బొలికొండయ్య గార్లు శ్రద్ధ వహించి 1957వ సంవత్సరంలో పునఃనిర్మాణం జరిగినది.

సువిశాలమైన దేవస్థానము నందు రాజస్థాన్‌, జైపూర్‌ నుండి మేలిరకములైన పాలరాతి విగ్రహములు తీసుకొనివచ్చి 9 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమములు పట్టణ మరియు పల్లెప్రజలకు, ఆర్యవైశ్య సోదరసోదరీమణులకు పగలు, రాత్రి సమారాధన జరిపి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించినారు.

ఈ కార్యక్రమమునకు వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి విగ్రహమునకు కీ॥శే॥ గొంది నాగయ్య శ్రేష్టి గారు, లక్ష్మీనారాయణ విగ్రహములకు శెట్టి క్రిష్టయ్య శెట్టి గారు, హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహములకు శెట్టి కొండయ్య శెట్టి గారు, రాధాకృష్ణ విగ్రహములకు పుల్లగూరు బాలయ్యశెట్టి గారు, నవగ్రహ విగ్రహములకు కోవూరు రామయ్య శెట్టి గారు విరాళములు ఇచ్చినారు.

నాటి నుండి నేటి వరకు వాసవీ జయంతి, దసరా దేవి నవరాత్రుల కార్యక్రమములు మరియు వాసవీ ఆత్మార్పణ దినము అత్యంత వైభవముగా జరుగుచున్నవి.

ఆధ్యాత్మిక మరియు సేవాభావంతో పైన కనబరచిన పెద్దలందరి సహాయసహకారములతో **11-9-1962** సంవత్సరమును ఆర్యవైశ్య సంఘము ఏర్పడినది. ఇందుకు కీ॥శే॥ డి.సి. నరసింహయ్యశెట్టి గారి అధ్యక్షతన, కీ॥శే॥ మేదా రామయ్యశెట్టి గారిని తొలి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకొనబడినది.

వీరి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తగా కీ॥శే॥ డి.సి. నరసింహయ్యశెట్టి గారు, ఉపాధ్యక్షులుగా కీ॥శే॥ గొంది నాగయ్యశెట్టి గారు, గొనుగొండ్ల వీరన్న శెట్టి గారు, కార్యదర్శిగా కీ॥శే॥ కల్లూరు రాజగోపాలయ్య గారు, సహాయ కార్యదర్శులుగా కీ॥శే॥ తలుపుల వెంకటయ్య గారు, కీ॥శే॥ వి.ఎల్‌. రంగయ్య గారు, కోశాధికారిగా కీ॥శే॥ ముత్యాల సుబ్బరంగయ్య గారు, కార్యవర్గ సభ్యులుగా కీర్తిశేషులైన గొంది కొండయ్య గారు, కె.బి. లక్ష్మయ్య గారు, సుంకు నారాయణ రంగయ్య గారు, తొమ్మండ్ర నాగయ్య గారు, కోవూరు వెంకటరత్నం బి.ఎ., గారు, శెట్టికొండయ్య గారు, శ్రీ మారడుగు ఓబుళప్ప గారు, సత్రసాల రామయ్య గారు, గాధంశెట్టి వెంకటరమణప్ప గారు, మాదాళం నరసింహయ్య గారు, పిన్ని క్రిష్ణమూర్తి గారు, సంఘ సలహా సభ్యులుగా కీ॥శే॥ మారడుగు నరసింహప్ప గారు, దూపకుంట్ల సత్యనారాయణప్ప గార్లతో మొట్టమొదటి కార్యనిర్వాహక వర్గం ఏర్పాటు చేయడమైనది.

 

 దేవాలయము మరియు కళ్యాణమండపము అభివృద్ధి పనులు

1. 1963వ సంవత్సరము కళ్యాణమండపము నిర్మాణ కార్యక్రమము ప్రారంభమైన 1965వ సంవత్సరమున పూర్తి గావించబడి వివాహాది కార్యక్రమాలు నిర్వహించుచున్నారు.

2. 1976వ సంవత్సరము నిర్మితమైన కట్టడముపైన మేడా రామయ్య గారి కళ్యాణమండపము మరియు 6 వసతి గదులు నిర్మాణము ప్రారంభించి 1980వ సంవత్సరము గౌ. మంత్రి శ్రీ రోశయ్య గారిచే ప్రారంభం జరిగినది.

3. 1976వ సంవత్సరము దేవాలయం ఎదురుగావున్న గాలిగోపురము నిర్మాణము పుట్టపర్తి సాయిబాబా గారి హాస్పిటల్‌ గాలిగోపురము మరియు ఆంజనేయస్వామి విగ్రహములు తయారుచేసిన తమిళనాడు వాస్తవ్యులు స్తపతి సుబ్రమణ్యం గారి శిల్ప బృందంచే నిర్మించబడినది.

4. 1991వ సంవత్సరము దేవాలయం బయట మరియు లోపలిబాగంలో గోపుర నిర్మాణము మరియు గణపతి అష్టలక్ష్మి సమేత విగ్రహములు కీ॥శే॥ గోపా భక్తవత్సలం గారు అధ్యక్షులుగా వారి పర్యవేక్షణలో నిర్మాణము జరిగినది.

5. 1996వ సంవత్సరములో ప్రతి కళ్యాణమండపమునకు వేరువేరుగా డైనింగ్‌ హాల్‌ నిర్మాణము కీ॥శే॥ జి.వి. సుబ్బయ్య మరియు మేడా పార్వతమ్మ చారిటీస్‌ వారి ఆర్థిక సహకారములచే నిర్మితమైనది. దాదాపుగా 200 మందికి భోజన వసతి సౌకర్యం కలదు. ఈ కార్యక్రమములు వైశ్యకుల పీఠాధిపతి అయిన పూజశ్రీ చంద్రశేఖర స్వామిజీ వారి అమృత హస్తములచే ప్రారంభించబడినది.

6. అక్టోబర్‌ 2010వ సంవత్సరము వంటరూములు నిర్మాణము కీ॥శే॥ కట్టా రంగయ్య గారి వంశీయులచే నిర్మించి, ప్రారంభించబడినది.

7. 25-01-2012వ సంవత్సరము వంటరూములు నిర్మాణము కీ॥శే॥ శిరిగుప్ప నారాయణశెట్టి గారి వంశీయులచే నిర్మించి, ప్రారంభించబడినది.

8. వాసవీ మాతకు బంగారు చీర, బంగారు నగలు, అభయహస్తం, వెండి చీర, వెండి కవచము, వెండి కిరీటము మొదలగునవి వాసవీ యువజన సంఘము మరియు ఆర్యవైశ్య మహిళా మండలి వారి సహాయ సహకారంతో చేయించబడినవి. విశేష దినములయందు మరియు ఉత్సవాల సందర్భములో వీటిని అలంకరించబడును.

9. వాసవీ మాతకు బంగారు కిరీటము, పాదములు మొదలగునవి కీ॥శే॥ చిత్రాల కిరీటప్ప గారి పర్యవేక్షణలో ప్రజల ఆర్థిక సహాయంతో చేయించడమైనది.

10. ప్రస్తుత పాలకవర్గ్లము ఆర్థిక సహయంచే 5-10-2013వ సంవత్సరము నూతనముగా అధ్యక్ష భవనము మరియు మీటింగ్‌హాల్‌ నిర్మించి, ప్రారంభించబడినది.

 

పూజా కార్యక్రమములు

1. పురాతన నగరేశ్వర దేవాలయములో మూలవిరాట్టుకు మరియు తదితర మూర్తులకు నిత్యపూజలు, కార్తీక మాసం, మాఘమాసం, ధనుర్మాసములో ప్రత్యేక పూజలు జరుగును. మహాశివరాత్రి రోజున నగరేశ్వరునికి జాగరణ పూజలు జరుగును. వైశాఖమాసం నందు శ్రీ ఆంజనేయ స్వామి సీతారామ లక్ష్మణ మూర్తులకు విశేష పూజలు గావించి తుదవరి రాము పట్టాభిషేకము జరుపబడుచున్నది. ముందురోజు అగ్నిగా అభిషేకించిన ఉదయం నుండి 24 గంటలు అఖండరామ భజన జరుగబడుచున్నది. వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వాసవీ జయంతి ఉత్సవము కూడా వేడుకగా జరుపబడును. ప్రాతఃకాలము నుండి మూలవిరాట్టుకు త్రికాలార్చనము గావించి, పంచామృత అభిషేకములు, పూజలు, ఉత్సవ విగ్రహముతో గ్రామోత్సవము, ఆర్యవైశ్య మహిళామండలి మరియు వాసవీ యువజన సంఘము వారిచే 108 కన్యలతో 108 కలశములతో వాసవీదేవి గ్రామోత్సవము జరుపబడును. తదుపరి అమ్మవారి తులాభారము, సామూహిక కుంకుమార్చన, మహామంగళహారతితో తదుపరి నగర ఆర్యవైశ్యులకు విందు భోజనం జరుపబడును.

2. భాద్రపద మాసం నందు చవితి రోజున వినాయకునికి 5 రోజులు వేడుకలు అత్యంత వైభవముగా వాసవీ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరుగును.

3. శ్రావణ మాసంలో కృష్ణపక్షమి వైభవముగా జరుపబడును. పూజాదికాలు కడు శ్రద్ధతో ఈ కార్యక్రమము జరిగిన సాయంకాలం ఉట్టి కార్యక్రమము కడు ఉత్సాహంగా వృద్ధులు, యువకులు, బాలబాలికలు పాల్గొని తరించిరి. తదుపరి 5 సంవత్సరములు బాలబాలికలకు శ్రీకృష్ణ రాధా వేషధారణలో పోటీలను మరియు అలంకరణ జరుగును.

4. ఆశ్వీయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ ఏకాదశి వరకు అనగా 10 రోజులు కడు వైభవముగా జరుపుకొనబడును. ఆయా కమిటీ వారు ఘన భక్తితో అత్యంత వైభవముగా దేవీసప్తమును అలంకరించి చూపులను ఆకట్టుకొంటారు. తమిషాడు మరియు కర్ణాటక నుండి ప్రత్యేక బృందం వారిని పిలిపించి ఉత్సవ విగ్రహములకు రోజుకొక దేవి వేషంతో పది రోజులు అలంకరించిరి. మూలవిరాట్టుకు ఆయా పూర్ణోత్సవాలే రోజుకొక అలంకారము చేయించెదరు. కులమత భేదము లేకుండా అన్ని కులముల వారు ప్రతి రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు దర్శించి, ఆలయ కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసిన **“పువ్వాజా”** ప్రసాదమును స్వీకరించెదరు. ఈ పది రోజులు పాతవూరు, గాంధీబజారు పెద్ద వీధిగా ఉండును. రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోవును. విజయదశమి రోజున గ్రామోత్సవము మరియు ఏకాదశి రోజు వసంతోత్సవము, శయనోత్సవముతో దశరా వేడుకలు ముగించబడును.

5. మాఘమాసం నందు శుద్ధ విదియ రోజున వాసవీ విశ్వరూపదర్శనం (ఆత్మార్పణ దినం) వైభవముగా తుదితర కార్యక్రమములు జరుగును. ఈ సందర్భముగా 41 రోజులు మండల పూజలు, దీక్షలు ముగించుకొని వాసవీ దీక్ష సమితి వారి బృందం వారు వైశ్యవంశికులకు వెళ్లి దీక్షలు ముగించేటట్లు.

6. ప్రతి మంగళవారం వాసవీ దేవికి బంగారు పుష్పములతో అర్చన, రథోత్సవము పూజాదికాలచే శాస్త్రోక్తముగా నిర్వహించబడును.

7. ప్రతి శుక్రవారం వాసవీ దేవి ప్రాకారోత్సవ పల్లకీ సేవ మరియు ఊంజలసేవ నిర్వహించబడుచున్నవి.

8. వాసవీ దీక్ష సమితి వారిచే నిత్య అగ్నిహోత్రము (హోమము) గత 7 సంవత్సరముల నుండి జరుపబడుచున్నది.

9. ప్రతి శనివారం శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణము, శ్రీ విష్ణు సహస్ర నామ సప్తగానము వారిచే జరుపబడుచున్నది.

 

సంఘ సేవా కార్యక్రమములు

1. 1957వ సంవత్సరము నుండి నేటి వరకు సంఘము పలు ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా కార్యక్రమములు చేయుచున్నాము.

2. భారతదేశానికి జరిగిన చైనా యుద్ధం 1962వ సంవత్సరమున భారతప్రభుత్వమునకు ఆర్థిక విరాళము ఇవ్వబడినది.

3. పేద వైశ్యులకు పేదవారి పెళ్లిళ్లు.

4. వాసవీ జయంతి రోజున పేదలకు ఆహారధాన్యములు కిట్లు.

5. వాసవీ రక్షణ నిధికి చేయిన రక్షణం.

6. నవంబర్ 1977వ సంవత్సరమున సంభవించిన ప్రకృతి విపత్తు ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకు ధనసహాయం, వస్త్ర రూబేణి మరియు ఆహారధాన్యముల కిట్లు పంపుట జరిగింది.

7. ఏప్రిల్ 1980వ సంవత్సరమున సామూహిక వివాహములు నిర్వహించబడినవి. పేద వైశ్య దంపతులకు ఆర్థిక సహాయము, వస్త్ర సహాయము, మాంగల్యము సహాయము చేయుట జరిగింది.

8. అనంతపురము జిల్లా కరువుకు విలయతాండవము. ఇచ్చుట వర్షపాతము చాలా తక్కువ. ప్రజల జీవనాధారము చాలా కష్టము. ఈ విపత్తును గురించి 1995వ సంవత్సరము నవంబర్ నెల 5వ తేదీ నుండి వందమంది కీ॥శే॥ గొంది సుబ్బయ్య గారి పేర్ల నగర బజారునకు ఖరీదైన నిధము విరాళము ఇవ్వడము జరిగింది. ఆ నిధము నుండి వైశ్య బాలికలకు పది గృహం నిర్మాణం చేసి దాదాపు 200 మంది బాలికలకు సరిహద్దు వసతిగృహము మరియు భోజన సౌకర్యం అతితక్కువ ఖర్చుతో ఇవ్వడం జరుగుతున్నది. 50 మంది పేద బాలికలకు ఉచిత వసతి, భోజనం మరియు పాఠ్యపుస్తకాల సౌకర్యం కలుగజేయబడుతున్నది.

9. 1980వ సంవత్సరమున కీ॥శే॥ యక్కల నారాయణశెట్టి గారు ఇచ్చిన భూమి స్థలమును వైశ్యులకు వైదిక కర్మలు చేయుటకు భవన నిర్మాణము మరియు పేద వైశ్యులకు ఉచితముగా ఈ కార్యక్రమము నిర్వహించబడుచున్నది.

10. ఈ సంఘము అనుబంధ సంఘము అయిన అతి పూరాతనమైన హరిజనవాడ (దళిత సంస్కారముల వాటికి) దాదాపుగా 125 లక్షల ఖర్చుతో ఆధునీకరించి నకల సౌకర్యములతో కుల, మత భేదములు లేకుండా దహన సంస్కారములు నిర్వహించబడుచున్నవి.

11. అక్టోబర్ 2009వ సంవత్సరమున కర్నూలు పట్టణములో జరిగిన వరద బీభత్సమునకు గురైన బాధితులకు మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య సంఘం వారు ఆహారము, వస్త్రములు, మందులు, ఆహార ధాన్యపు కిట్లు పంపుట జరిగింది.

12. పై తెలుపబడిన ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా కార్యక్రమములు సంఘ అనుబంధ సంస్థలైన 1976వ సంవత్సరములో ఏర్పడిన ఆర్యవైశ్య యువజన సంఘము, 1979వ సంవత్సరమున ఏర్పడిన వాసవీ మహిళా మండలి మరియు వాసవీ దీక్ష సమితి వారి సహాయ సహకారములతో మరియు పుట్టల పురుషుల ఆధ్యాత్మిక సోదరసోదరీమణుల సహాయసహకారములతో ఘనముగా నిర్వహించబడుచున్నవి.

 

చేయదలసిన దేవాలయ / కళ్యాణమండపము అభివృద్ధి పనులు (ఆస్తులు)

1. కళ్యాణమండపములో రూములు ఆధునీకరణ మరియు ఏసీ గదులు, ఏసీ కళ్యాణమండపము, ఆధునీకరణ పరికరములు మరియు వసతి సౌకర్యములు కార్యక్రమములు చేపట్టుటకు సంకల్పించినాము. ఇందుకు ఆర్థికముగా సహాయసహకారములు అందిస్తూ శ్రీ వాసవీ మాత కృపకు పాత్రులని కోరుచున్నాము.

Many Arya Vysyas asking about to contribute for our Temple development, this below link maybe useful for them.

http://www.aryavysyasangham.org/payments.html

Or you may use this below information for your contributions.

Please contact us before contribution through phone call or through email as shown below.

Please contact us before contribution through phone call or through email as shown below.

Bank Details

  • Bank: ICICI Bank , Raju Road, Ananthapuramu
  • Account Name: Arya Vysya Sangham
  • Account Number: 043901001611
  • IFSC Code: ICIC0000439
  • MICR Code: 515229002

Postal Address

Arya Vysya Sangham,

Gandhi Bazaar,

Old town,

Anantapur - 515001.

Land Phone : 08554-239641

Dubakuntla Sainath Guptha, Cell : 90325 02538

Our email is: AryaVysyaSangham@yahoo.com